కాంగ్రెస్ పార్టీకి అధికారంపైనా లేదా ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని వెల్లడించారు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా బెంగళూరులో రెండో రోజు జరుగుతోన్న విపక్షాల సమావేశంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.