మహారాష్ట్ర మాజీ ఎంపీ, బీజేపీ నేత కిరీట్ సోమయ్యకు చెందిన ఓ వీడియో తాజాగా లీక్ అయింది. అర్ధనగ్నంగా బెడ్‌పై పడుకుని ఓ మహిళతో ఆయన వీడియో కాల్ మాట్లాడారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియో ఫేక్ అని కిరీట్ సోమయ్య పేర్కొన్నారు. ఓ వైపు ప్రతిపక్షాలపై బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని, మరో వైపు ఆ పార్టీకి చెందిన నేతల అశ్లీల వీడియోలు బయటకొస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.