జగనన్న తోడు క్రింద జిల్లాలో 9, 489 మంది లబ్ధిదారులకు రూ. 10. 22 కోట్లు ఆర్థిక సహాయం లబ్దిదారుల ఖాతాల్లో జమ అయింది. చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం ఇచ్చే జగనన్న తోడు ఏడవ విడత (వరుసగా నాలుగో ఏడాదిలో మొదటి విడత) ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని మంగళ వారం రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.