ఎస్. కోట మండలం ధర్మవరంలో మంగళవారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు పాల్గొన్నారు. అర్హత కలిగిన ప్రజలు జగనన్న సురక్ష ద్వారా సంక్షేమ పథకాలు, ధృవపత్రాలను పొందాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరరావు, ఎస్. కోట సర్పంచ్ సంతోషి కుమారి, స్థానిక సర్పంచ్ గాలి సన్యాసయ్య, ఎంపీడీవో శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.