రాష్ట్రానికి రావలసిన హక్కులు సాధించే విషయంలో వైసీపీ, టీడీపీ దొందు దొందే అని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రతేక హోదా సాధించడంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు విఫలం అయ్యాయన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, రాజధాని తదితర అంశాలలో రెండు పార్టీలు విఫలం చెందాయన్నారు.