నేడు ఉదయం సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే అవినాష్ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. దీంతో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. గంగిరెడ్డి, అవినాష్ బెయిల్ కలిపే వింటామని తెలిపింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరగా.. అవినాష్ రెడ్డి బెయిల్‌తో పాటు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.