చిత్తూరు జిల్లా, పుంగనూరులో రూ.60 వేల విలువ చేసే 5.97 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులని అరెస్ట్ చేసినట్లు పుంగనూరు ఇన్చార్జి సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.... యూఎన్ఆర్ (చదళ్లమిట్ట) సర్కిల్లో చింతచెట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే ఎస్ఐ మోహన్‌కుమార్, తహసీల్దార్ సీతారామ్ వెళ్లారన్నారు. ఇద్దరు వ్యక్తులు బ్యాగులు పట్టుకుని నిలబడి ఉండగా అదుపులోకి తీసుకుని పరిశీలించడంతో వారి వద్ద 5.97 కిలోల గంజాయి ఉందన్నారు. పుంగనూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన ఆవుల ప్రభాకర్, తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వళ్లలూరుకు చెందిన ఎస్ఆర్.కృష్ణగా విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఆవుల ప్రభాకర్ మదనపల్లెలో బంధువుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేశారని, పాత పరిచయంతో తమిళనాడుకు చెందిన ఎస్ఆర్ కృష్ణ ఇప్పటికే నాలుగైదుమార్లు కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.