శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమ్ సింఘే జులై 21న భారత్లో అధికారికంగా పర్యటించనున్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారని చెప్పింది. దౌత్య, వ్యూహాత్మక సంబంధాలపై చర్చిస్తారని పేర్కొంది. భారత్లో విక్రమ్ సింఘే పర్యటించడం ఇదే మొదటిసారి.