చిరువ్యాపారులకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ వరుసగా నాల్గవ ఏడాది మొదటి విడత నేడు చేసారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని రూ. 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది.