అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైకాపా నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విబేధాల పరిష్కారం కోసం సీఎం కార్యాలయం నుంచి పిల్లి సుభాష్‌కు పిలుపు వచ్చింది. దీంతో ఆయన మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు. తన అనుచరుడు కోలమూరి శివాజీపై మంత్రి వేణు అనుచరుడు దాడి చేశారన్నారు. పిల్లి సుభాష్‌తో సీఎం జగన్ సమావేశం అరగంట పాటు జరిగింది.