ఓ యువకుడు మద్యం మత్తులో తల్లిదండ్రులను కొట్టిచంపిన ఘటన బెంగళూరులో జరిగింది. బ్యాటరాయనపుర పోలీసు ఠాణా పరిధిలో భాస్కర్ (63), శాంత (60) తమ రెండో కుమారుడు శరత్ తో కలిసి ఉంటున్నారు. సోమవారం రాత్రి శరత్ మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆ క్రమంలోనే వారిని తీవ్రంగా కొట్టి పారిపోయాడు. మంగళవారం ఉదయం చూసే సరికి ఇద్దరూ విగతజీవులుగా పడున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.