ఈ నెల 20, 21 తేదీల్లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే భారత్కు రానున్నారు. ఈ పర్యటనలో విక్రమసింఘే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.