ఏపీలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ తీసుకోని వారి కార్డు రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించింది. నూతన రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తామని తెలిపింది. 'జగనన్న సురక్ష'లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు కార్డులు ఇస్తామని తెలిపింది.