పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సమావేశాలకు ముందు పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. కాగా, ఇటీవల ఢిల్లీ పాలకపక్ష పార్టీలు, బెంగళూరులో ప్రతిపక్షాలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడివేడీగా కొనసాగే అవకాశముంది.