అల్జీమర్స్ వ్యాధిని ప్రారంభ దశలోనే నివారించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త ఔషధాన్ని కనుగొన్నారు. ఈ ఔషధం విషయగ్రహణ సామర్థ్యంలో క్షీణతను నెమ్మదింపజేస్తుందని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ పరీక్షల అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎలి లిల్లీ అభివృద్ధి చేసిన ఈ మెడిసిన్‌కు ‘డోనానెమాబ్’ అని పేరు పెట్టారు.