పబ్జీలో యూపీ యువకుడితో ప్రేమలో పడి భారత్‌కు వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్(30)ను యూపీ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో సీమా ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, అడిగిన ప్రశ్నలకు ఎంతో ఆలోచించి జవాబు ఇస్తోందని చెబుతున్నారు. ప్రియుడు సచిన్ మీనా (25) దగ్గరికి డైరెక్ట్‌గా రాలేదని, ఢిల్లీలో కొందరిని కలిసి యూపీకి వచ్చినట్లు పోలీసులు తేల్చారు. ఆంగ్లలో సీమా ఉచ్ఛారణ స్పష్టంగా ఉందని, ఆమె పాక్ గూఢచర్య ప్రతినిధిగా పోలీసులు అనుమానిస్తున్నారు.