భార్యాపిల్లలను కాపాడి రైతు కన్నుమూసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శింగనమల పరిధిలోని నార్పల-4 ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, భర్త బాలకృష్ణ(40), పిల్లలతో కలిసి పొలంలో పురుగు మందులు పిచికారీ చేయడానికి వెళ్లారు. భాగ్యలక్ష్మి నీటి కోసం మోటారు స్విచ్ వేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో బాలకృష్ణ భార్య పిల్లలను పక్కకు లాగి, స్టార్టర్ పెట్టెపై పడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.