ఏపీలోని ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. నవీన్ అనే గిరిజన యువకుడిని చితకబాది నోట్లో మూత్రం పోశారు. మోటా నవీన్, మన్నె అంజి ఇద్దరూ చోరీలకు పాల్పడుతుంటారు. వీరిమధ్య విభేదాలు తలెత్తడంతో నవీన్ ను అంజి మద్యం తాగుదామని కిమ్స్ ఆసుపత్రి వెనకాల వైపు తీసుకువెళ్ళాడు. మద్యం తాగిన అనంతరం అంజితో పాటు మరో 9 మంది నవీన్ ను రక్తం వచ్చేలా కొట్టారు. నవీన్ నోట్లో మూత్రం పోసారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.