కాంగ్రెస్ పార్టీపై బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోని విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పన్నాగం పన్నుతోందన్నారు. కులతత్వ, ధనిక పార్టీలతో జతకట్టి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ కూడా ఎన్డీఏను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ రెండు పార్టీల వల్ల దళితులు, ముస్లింలు తీవ్రంగా నష్టపోతారన్నారు.