కనగానపల్లి మండలంలో మారుమూల గ్రామాల రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సీపీఐ రైతు సంఘం నాయకులు రోడ్లు భవనాల శాఖా ఆధికారులు, ధర్మవరం ఆర్డీఓ తిప్పే నాయక్ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. రైతు సంఘం అధ్యక్షులు గోవిందు, సీపీఐ మండల కార్యదర్శి ఈశ్వరయ్య, సహాయ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ. కనగానపల్లి, కొనాపురం, పేరూరు, కోనేటి పాళ్యం రహదారులు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు.