ధర్మవరంలో పట్టణంలో నేతన్న నేస్తం లబ్ది దారులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సొంత మగ్గం కలిగిన అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి నేతన్న నేస్తం పథకం ద్వారా రూ. 24 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తోంది. ఈనెల 21న నేతన్న నేస్తం 5వ విడత లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేసారు.