పాడి రైతుల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బుధవారం తెలిపారు. రాప్తాడులో ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సాంత డబ్బు వెచ్చించి పదివేల మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు అమ్మ డెయిరీ ని ఏర్పాటు చేశామని, మరో రెండు రోజుల్లో పాల సేకరణ ప్రారంభం కానుందని, డెయిరీలో ఉన్న ప్రతి పాడి మహిళా రైతుకూ 90 రోజులకోసారి లాభాల్లో వాటా తప్పనిసరిగా అందజేస్తామన్నారు.