స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 302 పాయింట్లు లాభపడి 67,097కు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా 67 వేల పాయింట్ల పైన ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,833 వద్దకు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (2.86%), బజాజ్ ఫైనాన్స్ (2.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.07%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.96%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.64%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-0.82%), భారతీ ఎయిర్టెల్ (-0.68%), మారుతీ (-0.61%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.43%), నెస్లే ఇండియా (-0.36%).