చెన్నే కొత్తపల్లి మండలం హరియాన్ చెరువు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ బుధవారం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి బంధువులు మాట్లాడుతూ. రెండు రోజుల క్రితం ఆదిలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.