పార్లమెంట్లో విభజన చట్టం అమలు కోసం మా వంతు పోరాటం చేస్తామన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ప్రత్యేక హోదాతో ఏపీని ఆశీర్వదించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మా మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమన్నారు. 25కు 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకోవడం ఖాయమన్నారు. పవన్ స్టాండ్ ఏంటో ఆలోచించుకోవాలి. పాచిపోయిన లడ్డూలు అంటూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పవన్ ఇప్పుడెందుకు కలుస్తున్నారని విమర్శించారు.