ఆస్ట్రేలియాకు చెందిన పాపులర్ రేడియో షో ‘ఫిట్జీ అండ్ విప్పా విత్ కేట్ రిచీ’లో కిమ్ అనే మహిళ తన పెళ్లిలో జరిగిన అతి పెద్ద పొరపాటు గురించి చెప్పుకొచ్చింది. ‘నా పెళ్లికి సాక్షులుగా సంతకం చేయడానికి మా మామగారు, అత్తగారు తప్ప ఎవ్వరూ లేరు. దీంతో సాక్షి సంతకం చేయమని నా భర్త కోరగా వరుడు అని ఉన్న చోట మా మామగారు పొరపాటున సంతకం చేశారు. ఆ సర్టిఫికెట్ ఇంకా అలాగే ఉంది.’ అని పేర్కొంది.