జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పిస్తామని ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవీణ్ అన్నారు. గురువారం పొన్నూరు మండలం తాడిపర్రు, మునిపల్లె గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. కూలీల మస్టర్లతో పాటు కొలతలు ప్రవీణ్ పర్యవేక్షించారు. పిచ్చి మొక్కలు, కాలువ పూడికతీతలు తదితర ఉపాధి హామీ పనులు చేశారు.