టీడీపీ తీరును వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. సీఎం వైయస్ జగన్ గారిపై అసూయ, ద్వేషం పెంచుకోవడం తప్ప ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఆత్మశోధన చేసుకోవడానికి టీడీపీ ఇష్టపడటం లేదు. ప్రజాక్షేత్రాన్ని వదిలి సిఎం లక్ష్యంగా మౌఖిక దాడులకు తెగబడటం వల్ల ఒనగూరేది ఏమీ ఉండదు. గ్రామానికి 10 మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకున్నా రాజకీయ పార్టీగా మనుగడ ఉండేది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.