ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పాసిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించిన పవన్.. ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైయస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బీజేపీని తిట్టి 2019లో ఒంటరిగా పోటీ చేసి, 2024లో ఎందుకు ఏన్డీఏను కలుపుకొని వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ ఢిల్లీలో సినిమా యాక్టింగ్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు.