ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవన ప్రమాణాల పెంపుదలకు సంక్షేమ పధకాలు ఎంతో అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 05:44 PM

అన్ని వర్గాలకూ అండగా ఉండేందుకు జగనన్న సురక్ష కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నామ‌ని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాల పెంపుదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా పేదలకు చేయూతనిస్తున్నామ‌న్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా  549 మందికి వివిధ ధ్రువీకరణ పత్రాలు అందించారు. జిల్లా మొత్తం మీద 2.5 లక్షల ధ్రువీకరణలు ఇవ్వనున్నామని మంత్రి ధర్మాన చెప్పారు. సతివాడ సచివాలయం, కొర్లాం సచివాలయం పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.కొర్లం సచివాలయం పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమం లో 703 వివిధ ధృవీకరణ పత్రాలు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com