రాష్టాన్ని విడగొట్టి తొమ్మిదేళ్లు పూర్తయినా ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీ సమస్యలపై కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పార్లమెంట్లో వైయస్ఆర్ సీపీ గళం వినిపిస్తుందన్నారు.