విద్యార్థుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలపై బుధవారం ఆందోళన చేపట్టిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం గర్హనీయమని ఖండించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపజేయాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని కోరారు.