ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 20, 2023, 06:36 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌  ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేసేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. "పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీఆర్‌పీసీలోని 199/4 కింద కేసులు పెట్టేందుకు సర్కారు అనుమతిచ్చింది. వాలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వం చర్యలు. మీరు చేసే ప్రాసిక్యూషన్లకు నేను భయపడను. అరెస్ట్‌కు రెడీ.. పవన్‌ కళ్యాణ్‌. ఈ ఒక్క సంఘటనే నీ ప్రభుత్వం పతనానికి రంగం సిద్దమైంది. దెబ్బలు తినడానికి, చిత్రహింసలకు కూడా సిద్దంగా ఉన్నా. అరెస్టులకు కూడా సిద్దంగా ఉన్నా ... జగన్ నేను రెడీ" అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com