విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌కు లేఖ రాశారు. సీఎం బటన్ నొక్కి 23 రోజులు గడిచినా ఇప్పటి వరకు చాలామంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు పడలేదని తెలిపారు. విద్యారంగంలో ‘నాడు-నేడు’ కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితమైందని, దానివల్ల ఎలాంటి ఫలితమూ లేదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతోందని తెలిపారు. 9 నెలల్లోనే 6.41 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారని పేర్కొన్నారు.