కడప నియోజకవర్గంలో టీడీపీ చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంమైంది. తెలుగు తమ్ము ళ్లు, ప్రజలు నీరాజనం పలికారు. షెడ్యూలు ప్రకారం బుధవారం సాయంత్రం 5గంటలకు అలంఖాన్‌పల్లెకు బస్సు యాత్ర చేరుకుంది. అనంతరం అమీన్‌పీర్ దర్గాకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రజలకు భవిష్యత్తు గ్యారంటీపై టీడీపీ నేతలు ప్రసంగించారు. అనంతరం మాసాపేట సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ స్రర్కిల్, హరిటవర్స్,. ఐటీఐ సర్కిల్, మహవీర్ సర్కిల్, అంబేడ్కర్, అప్సర, అన్నమచార్య విగ్రహం, దేవునికడప వరకు బస్సు యాత్ర సాగింది.