అద్దంకి మండలంలోని ఆయా గ్రామాలకు ఈనెల 28న జిల్లావ్యాప్తంగా లక్ష మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు తాసిల్దార్ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కలెక్టర్, డ్వామా పిడిలు ఈ నిర్ణయాన్ని సంయుక్తంగా తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మొక్కలు సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మండలంలో 5 వేల మొక్కలు నాటించనున్నట్లు తాసిల్దార్ తెలిపారు.