సంతమాగులూరు మండలం పత్తేపురం గ్రామంలో గ్రామ సచివాలయం నందు శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసిపి ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొని సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పౌర సేవల పత్రాలను అందజేశారు. ప్రజలకు నూరు శాతం పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కృష్ణ చైతన్య పేర్కొన్నారు.