సారవకోట మండలంలోని కిడిమి గ్రామపంచాయతీ భద్రాచలం పాఠశాలను గురువారం మధ్యాహ్నం మండల విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. విద్యార్థుల విద్య నైపుణ్యాలను పరిశీలించారు. ప్రభుత్వం సరఫరా చేసిన యూనిఫారాలను విద్యార్థులు రోజు వేసుకుని వచ్చే విధంగా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యా బోధన మెరుగుపరచాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు మడ్డువెంకటరమణ, భూ లక్ష్మి పాల్గొన్నారు.