ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'వాలంటీర్ల క్యారెక్టర్ ను తప్పుబట్టింది పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ గా పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్. అమ్మాయిలను లోబర్చుకొని, వారిని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహంబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతారు' అని అన్నారు.