పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అల్లర్లు కుదిపేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళలపై అమానుష ఘటనపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. వెల్లోకి దూసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ ఓంబిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. లోక్సభ, రాజ్యసభలోనూ ఇదే విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఆయా సభలను వాయిదా వేశారు.