వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటిస్తున్న సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమచేశారు. మొత్తం 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున రూ. 193 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో నేతన్నల ఆత్మహత్యలు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉండామన్నారు.