ఏపీలో మరో రైలు ప్రమాదం తప్పింది. మన్యం పార్వతీపురం వద్ద సమతా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. సమతా ఎక్స్ ప్రెస్ ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్ విడిపోయి వేరయ్యాయి. దీన్ని స్టేషన్ మాస్టర్, లోకోపైలట్ గుర్తించి రైలును నిలివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, పార్వతీపురం బెలగాం స్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు జరుగుతుండటంతో ఆ రూట్లో పలు రైళ్లను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది.