గుజరాత్ లోని సాబర్ కాంఠా జిల్లాలో ఓ గర్భిణీ 2 ముక్కులున్న చిన్నారికి ఇటీవల జన్మనిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. హిమ్మత్ నగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో జన్మించిన చిన్నారిని, మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, ప్రతి 8 వేల నుంచి 15 వేల మంది శిశువుల్లో ఒకరు ఇలా జన్మిస్తున్నారని పేర్కొన్నారు.