రేషన్ కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డ్, ఆధార్ అనుసంధానం గడువు జులై 30తో ముగుస్తుందని, రేషన్ కార్డు ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. లేకుంటే ఉచిత రేషన్ సదుపాయాన్ని కోల్పోతారని హెచ్చరించింది. కాగా, రేషన్ కార్డు, ఆధార్ అనుసంధానం గడువు జూన్ 30తో ముగియగా, కేంద్రం జులై 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.