ఏపీ ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను చేరువ చేసేలా ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది. దీనికోసం టెండర్లను పిలిచినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. అలాగే 250 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని, అద్దె బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.