కైలాస మానస సరోవర యాత్రకు కొత్త దారిని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం భారత యాత్రికులు సిక్కిం, నేపాల్ నుండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇక నుండి ఆ అవసరం లేకుండా కొత్త మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. ఉత్తరాఖండ్ లోని పిథోర్ గఢ్ నుండి లిపులేఖ్ పాస్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ మార్గం సెప్టెంబర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.