అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తవాంగ్‌కు 64 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.