ఓ చిన్నారి ఆడుకుంటూ ఇనుప స్తంభంలో ఇరుక్కుపోయిన ఘటన రేణిగుంట రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగింది. రాజంపేటకు చెందిన సాయికుమార్ తన భార్య, కుమార్తె సాయి యశస్వి(2)తో చిత్తూరుకు వెళ్లేందుకు రేణిగుంట రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. రైలు కోసం వేచి చూస్తుండగా చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇనుప స్తంభంలో ఇరుక్కుంది. దీంతో రైల్వే అధికారులు స్పందించి, ఇనుప కట్టర్లతో స్తంభం కింది భాగాన్ని తొలగించి పాపను బయటకు తీశారు.