ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలు రాష్ట్రాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భారీ వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటన యూపీలోని బిజ్నోర్ జిల్లాలో జరిగింది. మండావాలి ప్రాంతంలో ఓ బస్సు వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa