మణిపూర్ లో జరిగిన హింసపై ఇప్పటివరకూ 6 వేల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. మే 3న మొదలైన హింస, తదనంతరం జరిగిన దారుణాలకు సంబంధించి సోషల్ మీడియాపై నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. 16 జిల్లాల్లో ఇప్పటికీ సగం జిల్లాలు సమస్యాత్మకంగానే ఉన్నాయన్నారు. వైరల్ గా మారే వదంతులతో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, దీన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.